Raja sab: రాజా సాబ్ ఒకరోజు షూటింగ్ కి అంతనా!

-

ఒకప్పుడు దర్శకుడు మారుతి చిన్న చిన్న బడ్జెట్ సినిమాలతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీసే స్తాయికి వెళ్లాడు. చాలా తక్కువ బడ్జెట్స్ తో హిట్ చిత్రాలు తీయడం ఎలాగో చూపించాడు. అందుకే డైరెక్టర్ మారుతికి క్రేజ్. అయితే ఆయన డైరెక్ట్ చేసిన ‘ఈరోజుల్లో’ మూవీ థియేటర్లలో రీరిలీజ్ అవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకుడు మూవీ బడ్జెట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ మూవీ 4 రోజుల షూటింగ్కి ₹4 కోట్లు ఖర్చు చేసినట్లు మారుతి వెల్లడించారు.’ఒకప్పుడు ‘ఈ రోజుల్లో’ సినిమాని ₹30 లక్షల బడ్జెట్తోనే తీశా. కానీ రాజాసాబ్ మూవీకి 4 రోజుల్లోనే కోట్లు ఖర్చయింది అని తెలిపారు. ప్రభాస్ సినిమా కాకపోతే ఆ బడ్జెట్లో నేను రెండు మూడు సినిమాలు తీసేవాడిని’ అని అన్నారు. దీంతో రాజాసాబ్ సినిమా బడ్జెట్ ₹100 కోట్ల పైనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news