తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్దం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఓట్ల కోసం ఒకరిపై మరొకరు విమర్శలు కాస్త ఎక్కువగానే చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్- బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడిందని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలకు ఒక రహస్య ఒప్పందం ఉందని. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే చెబుతుందని, కానీ నేటితో అది నిజమని తెలిసిపోయిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొత్తం సీట్లు గెలవడం కోసం బీఆర్ఎస్ డమ్మీ క్యాండెట్లను సెలెక్ట్ చేసి నిలబెడుతుందని, వారి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అర్థం అవుతోందని ఆరోపించారు. ఈ విషయం ప్రజలు గమణించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం నేర్పించి.. తెలంగాణలో ఉన్న 17 సీట్లకు గానూ 16 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.