కడియంతో మళ్లీ పోరుకు సై అంటున్న రాజయ్య..

-

తెలంగాణ సిద్ధించాక తొలి సారిగా ఉప– ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వలస వచ్చి.. ఎమ్మెల్సీగా ఎన్నికై ఉప– ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కడియం శ్రీ హరి ఇద్దరు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన దళిత నేతలు. కానీ విధి వక్రీకరించి… వీరిరువురూ.. కొద్ది రోజుల్లోనే ఉప– ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి.. ప్రాభవం కోల్పోయారు. రాజయ్యకు కనీసం ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే గా పదవి అయినా.. ఉందని.. కడియం శ్రీ హరికి అది కూడా లేదని చాలా మంది అంటుంటారు.

రాజయ్య ఎమ్మెల్సీ పదవి కాలపరిమితి ఇటీవలే ముగియడంతో ఆయన తన పదవిని కోల్పోయారు. ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి గా ఉన్న శ్రీ హరి ఎలాగైనా అధిష్టానం మెప్పు పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని వినికిడి.

ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన నియోజకవర్గ నేత కడియం శ్రీ హరిని ఉద్దేశిస్తూ… స్టేసన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రొటోకాల్ ప్రకారం పదవి కోల్పోయిన వ్యక్తులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అనగా… దానికి స్పందించిన మరో దళిత నేత, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీ హరి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ ఇద్దరు దళిత నేతల వ్యవహారంపై పలువురు చర్చించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోతే కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు పార్టీలు మారి ఒకే పార్టీ కండువా కప్పుకుంటే పరిస్థితులు ఇలాగే మారుతాయని అంటున్నారు. తీవ్రంగా విరుచుకు పడ్డ మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై రాజయ్య ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news