స్టూడెంట్ నం.1 సినిమాతో దర్శకుడిగా మారిన ఎస్.ఎస్.రాజమౌళి మొదటి సినిమాతోనే సక్సస్ ని అందుకున్నారు. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమా తో జూ.ఎన్.టి.ఆర్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా సంచనలన విజయాన్ని అందుకుంది. ఎన్.టి.ఆర్ కి తిరుగులేని మాస్ ఇమేజ్ ని తీసుకు వచ్చింది. దాదాపు 70 కథ లని విన్న ఎన్.ట్.ఆర్ కి ఏది నచ్చకపోవడంతో వేరే హీరోకి అనుకున్న కథ ని ఎన్.టి.ఆర్ కి కేవలం 15 నిముషాలు మాత్రమే చెప్పారు రాజమౌళి.
ఈ కథ విపరీతంగా నచ్చడంతో వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్ లో వి దొరస్వామి రాజు సమర్పణలో తన తనయుడు నిర్మించారు. ఈ సినిమా కి కథ రాజమౌళి తండ్రి విజయోంద్ర ప్రసాద్ అందించారు. ఈ సినిమా నుంచి ఇప్పుడు రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకి తండ్రే కథ అందిస్తున్నారు. మద్యలో సునీల్ తో వచ్చిన ఒక్క మర్యాద రామన్న తప్ప ఛత్రపతి, సై, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి …ఇలా ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించిన సినిమాలన్ని తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో తయారైనవే.
తండ్రి రాసిన అద్భుతమైన కథ ని వెండితెరమీద అంతకంటే మహా అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి. మొదటి సినిమా నుండి బాహుబలి వరకు ప్రతీ సినిమా సూపర్ హిట్ అవడం గొప్ప విశేషం. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో రాజమౌళి కి బలం ఆయన తండ్రి..అని చెబుతుంటారు. అయితే ఇన్ని సక్సస్ లు అందుకున్న రాజమౌళి కథ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కారట. కథ తన తండ్రి రాసినదే అయినా ఏ ఒక్క సన్నివేశం లేదా ఏ ఒక్క పాత్ర నచ్చకపోయినా అసలు కాంప్రమైజ్ కారని చెబుతుంటారు. ఇదే విషయాన్ని ఇద్దరు ఒప్పుకున్న సందర్భాలున్నాయి.
ఎప్పుడైనా తండ్రి ..రాజమౌళి కి ఈ సీన్ బావుంటుందని ఎంతగా కన్విన్స్ చేసిన.. నచ్చకపోతే ఆ విషయం లో తండ్రిని కూడా లెక్క చేయరట. కావాలంటే మీరు ఇంకా టైం తీసుకోండి ..కాని నాకు మాత్రం ఇలా కావాలి అని ఖచ్చితంగా చెప్తారట. ఇదే ఇద్దరికి ఇన్ని సక్సస్ లు రావడానికి ప్రధాన కారణం అని చెబుతుంటారు. ఇక ప్రస్తుతం రాజమౌళి తన తండ్రి అందించిన కథ నే రౌద్రం రణం రుథిరం గా వెండితెరమీద ఆవిష్కరించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్స్ గా మార్చబోతున్నారట.