30 నిముషాలు చాలు… పనిలేనట్లు పత్యపారం ఎందుకు: మాధవీలత

-

సినిమాతారగా, రాజకీయ నాయకురాలిగా మాధవీలత అందరికీ సుపరిచితురాలే. నచ్చావులే సినిమాతో పరిచయమైన ఈ భామ.. ఆపై అంతగా ఆకట్టుకోలేకపోయింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీలత తాను చేసే వ్యాఖ్యలతో బాగా ఫేమస్ అయింది. ఆ మధ్య శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఎంటరవ్వడంతో లైమ్ లైట్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటే మాధవీలత ఈ మధ్య సంచలన కామెంట్స్ చేస్తోంది.

చిత్రపురి కాలనీలో జరిగే అన్యాయాల గురించి ఓ పోస్ట్ చేసింది. బీజేపీలో సాధినేని యామిని చేరడం, ఆమెకు పదవిని కట్టబెట్టడంపై మాధవీలత ఫైర్ అయింది. ఈ విషయంలో శ్రీ రెడ్డి ఎంటరై.. మాధవీలతపై విరుచుకపడింది. పరోక్ష కామెంట్లతో శ్రీరెడ్డిపై సెటెర్స్ వేసింది మాధవి. తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియలో యువత ఎక్కువగా గడుపుతోంది. వారి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని ఓ సుదీర్థమైన పోస్ట్ చేసింది. ఆమె చేసిన పోస్ట్ యథావిథిగా మీ కోసం..

‘సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడటం లో తప్పు లేదు
మన భావాలు వ్యక్తపరచడం లో తప్పు లేదు వేరే వారి సందేశాలు చూడటం లో తప్పు లేదు కేవలం ఒక 30 నిముషాలు చాలు
అదే పనిగా ఇంకా పనేమీ లేనట్లు పత్యపారం చేస్తే
వచ్చే సుకమేమో కానీ కళ్లు దొబ్బుతాయి
కనపడక కళ్లజోళ్లు ఎట్టుకోవాలి ,, లేనిపోని మాయరోగాలు వస్తాయి మెదడు దెబ్బతింటుంది
ఇదే మంచి సమయం
నేనేంటి ?
నేనెవరు
నా గమ్యం ఏమిటి
అసలు ఎందుకు మనం బతుకుతున్నాం
సాధించేవి ఏమిటి
ఇన్నాళ్లు ఎలా బతికాం
ఎం సాధించాము
డబ్బు ఒకటే జీవితమా?
ఆద్యాత్మికం
ఆంతర్యం
మంచి విషయాల పైన విశ్లేషణ
ఎంత గొప్పగా ఆలోచిస్తే మన మనసు బాగుంటుంది
ఎలాంటి ఆలోచన చేస్తే నిర్మలంగా ఉంటుంది
మాట తీరు ఎలా ఉంటె బాగుంటుంది

అలాగే నీలో నువ్వు
నీతో నువ్వు మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది
ఒంటరిగా మాట్లాడాము
నీ శరీరానికి ఏమి కావలి ఎం ఇస్తున్నావు
ఎన్నో చేయొచ్చు

నా పాటికి నేనెపుడు రోజుకి 30 నిముషాలు ఫేస్బుక్ అంతే

ఎపుడైనా లైవ్ ఉంటె కాస్త ఎక్కువ సమయం

నీతో నువ్వు ఒంటరిగా ఎక్కువగా గడపగలిగే
అద్భుత అవకాశం ఇదే
మళ్ళీ జీవితం లో రాదేమో

మనం చేసిన తప్పులు
మనం చేసిన ఒప్పులు
అన్ని సరిచూసుకుని
తప్పులుంటే ఇంకెప్పుడు వారి గురించి ఆలోచన చేయొద్దు ఎందుకంటే ఎంత ఎక్కువగా తప్పుల గురించి ఆలోచిస్తే మెదడు శరీరం
శక్తిని కోల్పోతుంది ,,, పవర్ అఫ్ స్పోకెన్

మనతో మనం అందం గ ఆనందంగా
ఆలోచించుకుంటూ నేను బాగున్నాను బాగుంటాను
అందరు బాగుంటారు బాగుండాలి
మంచి మాటనే మాట్లడడం ఇలాంటివి
ప్రాక్టీస్ చేస్తే అద్భుతాల్ని మనమే చూడొచ్చు

ఇది కచ్చితంగా జరుగుతుంది
కలలు కనండి కలల్ని కలకంటూనే నిజం చేసుకోవాలి
పంచభూతాలు సహకరిస్తాయి

నేను ,, ఇది నేను నా గురించి తెలుసుకుంటున్న
ప్రతి పేజీ చాల బాగుంది అనుకుంటే అంత బాగుంటుంది
కనుక ,, ఎంత వాడాలో అంతే వాడండి తప్ప అదే పనిగా
ఇందులోనే పడిఉంటే చాల నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది
ఎపుడు ఎవరో చేసేవి , పెట్టేవి ఒక హద్దు వరకు పరవాలేదు
కనుక ఇంత అందమైన సమయాన్ని ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోండి
పనిలేదు బోర్ కొడుతోంది అందుకే
పనికిరాని విషయాల్లో తలదూర్చేకంటే
పుస్తకాలు, పూజలు,( నమ్మేవారికి )
ఆద్యాత్మికం అంటే దేవుడే కాదు నీలో నువ్వు నీతో నువ్వు
నీ గుండె ఒక దేవాలయం అందులో ఎన్నో గదులు
నీ మెదడు ఒక సృష్టి
వెళ్లి అన్వేషించండి
నీకు నువ్వు కొత్తగా కనపడేలా … నీలో నువ్వు ముసిరిపోయేలా
గతించిన కాలం అందమైనది ఐతే తలచుకోండి నవ్వుకోండి
నిన్ను ఏడిపించేది అయితే ఈ క్షణమే వదిలేయండి
ఎందుకంటే గతం ఎపుడు తిరిగిరాదు కనుక

అందరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ
ప్రేమతో
మీ
మాధవీలత’ అంటూ ఆమె చేసిన ఈ పోస్ట్ ఎందరిలోనో ఆలోచనను రేకెత్తిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news