జక్కన్న నెక్ట్స్​ భారీ స్కెచ్ ఇదేనా​.. బాబోయ్​ ఎవరూ ఊహించని రేంజ్​లో ఆ ఇద్దరితో..

-

సినిమా ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ చిత్రసీమలో తరచూ వినిపించే మాట.. ట్రెండ్‌. అందుకే ఈ ట్రెండ్​కు తగ్గట్టే సినిమాలు రూపొందుతుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించే ట్రెండ్​.. మల్టీస్టారర్/పాన్ ఇండియా. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి భారీ బడ్జెట్​ చిత్రంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ లాంటి స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ మల్టీస్టారర్​పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

దీంతో దర్శకనిర్మాతలు భారీ కలయికల కోసం కథలు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి.. ఆర్​ఆర్ఆర్​ లాంటి మల్టీస్టారర్ తర్వాత తన కొత్త సినిమాను సూపర్​ స్టార్​ మహేశ్ బాబుతో అడ్వెంచర్ నేపథ్యంలో చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయి.

అయితే జక్కన్న ఈ సినిమా సెట్స్​పైకి ఇంకా తీసుకెళ్లకుండానే ఆయన గురించి మరో ఇంట్రెస్టింగ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదే దర్శకధీర నెక్ట్స్​ ప్లాన్​ ఏంటి అనేది ఆసక్తికరమంగా మారింది? ఇప్పుడిప్పుడే దీని గురించి చర్చ ప్రారంభమైంది. అదేంటంటే.. ఇప్పటికే వరుసగా భారీ సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్న జక్కన్న.. మహేశ్​తో సినిమా తర్వాత మరో పవర్​ఫుల్​ మల్టీస్టారర్​​ సినిమా కోసం ఓ ఐడియా వేశారంట. అదే టాలీవుడ్​ ఆక్షన్ ఆటమ్​ బాంబ్స్​ ప్రభాస్-ఎన్టీఆర్ కాంబోలో.

ఇప్పటికే బాహుబలితో ప్రభాస్​-ఆర్​ఆర్​ఆర్​తో ఎన్టీఆర్​ పాన్​ ఇండియా హీరోలుగా మారిపోయారు. అంతేకాకుండా వారి క్రేజ్​ కూడా ఈ చిత్రాలతో దేశవ్యాప్తమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అందుకే వీరిద్దరి కలయికో ఓ పవర్​ ప్యాక్డ్​డ్​ పాన్ వరల్డ్​ సినిమా తీయాలని యోచించినట్లు కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. మహేశ్ సినిమా తర్వాత దీని మీద పని చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఇది వినగానే సినీ ప్రేక్షకులు.. ఆ ఊహ ఎంత బాగుందో, నిజమైతే బాగుండు అని ఆశిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రభాస్​తో మూడు ఎన్టీఆర్​తో నాలుగు చిత్రాలు చేశారు రాజమౌళి.

ఇక రాజమౌళి-మహేశ్​ సినిమా విషయానికొస్తే.. యాక్షన్‌ ప్రధానంగా సాగనున్న ఈ చిత్రం కోసం జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసిన ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ఇందులో మహేశ్​ ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా కనిపించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news