యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. జనవరి 7న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా థియేటర్లపై కూడా ఆంక్షలు పెడుతున్నారు. ఢిల్లీలో థియేటర్లను మూసివేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ సినిమా వాయిదా పడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
కానీ సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తో సినిమాను వాయిదా వేసే ప్రసక్తే లేదని రాజమౌళి చెప్పినట్టు తరుణ్ పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతుందని వాయిదా వేసే ప్రసక్తే లేదని రాజమౌళి చెప్పినట్టు ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో సినిమా విడుదల పై క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రకటన తో అభిమానుల్లో ఉన్న టెన్షన్ కూడా పూర్తిగా తొలగిపోయింది.