రూ.11 వేల లోపే గుజరాత్ చూసొచ్చేయచ్చు.. వివరాలు మీకోసం..!

-

మీరు కొత్త సంవత్సరం లో మంచి టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. దీనితో చక్కగా ఈ ప్రదేశాలని అన్నీ చుట్టేయచ్చు. విజయవాడ, వైజాగ్ నుంచి గుజరాత్‌కు టూర్ ప్రకటించింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… వైబ్రంట్ గుజరాత్ పేరు తో ఈ ప్యాకేజీ వచ్చింది. రూ.10,400 ప్యాకేజీతో 11 రోజుల టూర్‌కు తీసుకెళ్తోంది ఐఆర్‌సీటీసీ. ఇక ఈ టూర్ లో భాగంగా ఏయే ప్రాంతాలని చూసి వచ్చేయచ్చు అనేది చూస్తే.. సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి.

అయితే ఈ టూర్ 2022 జనవరి 21న ప్రారంభం అవుతుంది. జనవరి 31న ఇది ముగుస్తుంది. ధర వివరాల్లోకి వెళితే.. స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.10,400 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. ఇక టూర్ వివరాలలోకి వెళితే.. మొదటి రోజు పర్యాటకులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్, పలాసలో రైలు ఎక్కాలి.

ఇక రెండో రోజు మూడో రోజు అయితే ట్రావెలింగ్ ఏ. సోమనాథ్ కి నాలుగో రోజు వెళ్లారు. సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుండి ద్వారకా వెళ్ళాలి. ఐదో రోజు ద్వారక చేరుకుంటారు. అక్కడ ద్వారాకాదీశ్ ఆలయంతో పాటు ఇతర ఆలయాలను చూడచ్చు. రాత్రి అక్కడే స్టే చెయ్యాలి. ఆరో రోజు బెట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం అవుతుంది. నెక్స్ట్ వాత్వ బయల్దేరాలి.

ఏడో రోజు వాత్వ చేరుకుంటారు. సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయం వంటివి చూడాలి. ఎనిమిదో రోజు విశ్వామిత్ర్‌కు బయల్దేరాలి. విశ్వామిత్ర రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడచ్చు. తొమ్మిదో రోజు, పదో రోజు రైలు ప్రయాణం ఉంటుంది. పదకొండో రోజు పర్యాటకులు మళ్ళీ వారి యొక్క రైల్వే స్టేషన్లకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news