ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు… సినిమా రంగం మూడు కుటుంబాల చేతిలో ఉందంటూ..

-

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ మూడు కుటుంబాల చేతిలోనే ఉందని అన్నారు. సినిమా పరిశ్రమ పై ఈ మూడు కుటుంబాల ఆధిపత్యమే కొనసాగుతుందని విమర్శించారు. పేదవాడు కూడా సినిమా చూడాలనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. నిర్మాతలు నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోలేదని విమర్శించారు. రాజకీయాల్లోనే కాదు.. సినిమా పరిశ్రమలో కూడా వారసత్వం నడుస్తుందన్నారు. ఎక్కువగా మాట్లాడితే సినిమా హీరోలు నన్ను ఓడిస్తారేమో అని అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కమిటీ నిర్ణయం తర్వాతే టికెట్ ధరలపై తదుపరి చర్యలు ఉంటాయని నారాయణ స్వామి అన్నారు.

టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయంలో యుద్ధం జరుగుతోంది. ఇటు టాలీవుడ్ ప్రముఖుల.. అటు ఏమీ మంత్రుల మధ్య కామెంట్లు, సెటైర్లు నడుస్తున్నాయి. నిన్న మంత్రి పేర్నినాని.. హీరో నాని, సిద్ధార్థ్ లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. నాని చేసిన థియేటర్ల కన్నా కిరణా షాపులకే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి పేర్ని నాని … ఆయన థియేటర్ టికెట్ కౌంటర్, కిరాణా కొట్టు కౌంటర్ లెక్క పెట్టి ఇలా మాట్లాడవచ్చ అంటూ స్ట్రాంగ్ గానే వ్యాఖ్యానించాడు. మరో హీరో సిద్ధార్థ్ కు గట్టిగానే చురకలు అంటించారు. తమిళనాడులో టాక్స్ పే చేసే సిద్ధార్థ్ కు ఏపీలో టికెట్ రేట్ల గురించి ఎందుకని వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news