ఏపీ సీఎం జగన్కు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభం ఏర్పడి సినీ రంగం, థియేటర్ల యాజమాన్యాలు కుదేలైన నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ ఓ భరోసా కల్పించారని రాజమౌళి కొనియాడారు. థియేటర్ల విద్యుత్ విషయంలో కనీస ఫిక్సడ్ చార్జీల నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయం అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నిర్ణయం థియేటర్ల యాజమాన్యాలకు తప్పక ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
My sincere thanks to AP CM @ysjagan garu for giving the industry hope in the time of a global crisis that has hit the film fraternity and theatre owners. Grateful to the government for waiving off minimum fixed power charges on theatres which is a relief. @AndhraPradeshCM
— rajamouli ss (@ssrajamouli) June 9, 2020