రజనీకాంత్ అభిమానులకు పండగలాంటి వార్త.. అన్నాత్తె రిలీజ్ డేట్ వచ్చేసింది.

-

రజనీకాంత్ సినిమా వస్తుందంటే దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ మధ్య కాలంలో రజనీ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అవన్నీ అభిమానులను బాధించాయి. తమ అభిమాన హీరో ఆరోగ్యంపై కలత చెందారు. ప్రస్తుతం ఆరోగ్యం విషయమై అమెరికాలో ఉన్న రజనీకాంత్, అభిమానుల కోసం అదిరిపోయే వార్త అందించారు. రజనీ హీరోగా నటించిన అన్నాత్తె సినిమా విడుదల తేదీ ప్రకటించారు. కరోనా వల్ల సినిమా థియేటర్లు మూసి ఉండడంతో సినిమా అభిమానులందరూ థియేటర్ అనుభవాన్ని మిస్సయ్యారు.

ప్రస్తుతం కేసులు తగ్గాయి. మరికొద్ది రోజుల్లో థియేటర్లు కూడా తెరుచుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే రజనీకాంత్ అన్నాత్తె సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తేదీ కూడా ప్రకటించింది. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రజనీకాంత్ అన్నాత్తె వస్తుంది. దీంతో రజనీ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనా తదితరులు నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news