హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కూతురు రిక్వెస్ట్ !

కరోనా మహమ్మారి అందరినీ వణికిస్తోందన్న సంగతి తెలిసిందే. కొందరి పరిస్థితి ఆందోళన కరంగా తయారు అవుతోందని చెప్పక తప్పదు. మొన్నీమధ్య కరోనా బారిన పడిన సినీ హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. నిజానికి పది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబంలో అందరికీ కరోనా సోకింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

రాజశేఖర్, ఆయన భార్య జీవిత, కుమార్తెలు శివానీ, శివాత్మికలు కరోనా బారిన పడగా కుమార్తెలు కోలుకున్నారు. అయితే జీవిత హోం ఐసోలేషన్ లో ఉండగా రాజశేఖర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి నుండి రాజశేఖర్ కు శ్వాససంబంధమైన ఇబ్బందులు తలెత్తినట్లు సమచారమ. నాన్న పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక తాజాగా ట్వీట్‌ చేశారు. కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారని, అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నాననని ఆమె తన ట్విట్టర్‌ లో కోరారు.