బిగ్ బాస్ నాలుగవ సీజన్ పై ప్రేక్షకుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటగా ఎలిమినేషన్ నిజంగా ఓటింగ్ ద్వారానే సాగుతుందా అనేది ఒకటైతే, అసలు ఓటింగ్ ప్రక్రియ నిజంగా ఫేర్ గా జరుగుతుందా అనేది మరొకటి. ఎలిమినేషన్ విషయంలో ఇప్పటికే రెండుసార్లు తప్పు జరిగిందని జనాలు భావిస్తున్నారు. దేవి నాగవల్లి విషయంలో, అలాగే కుమార్ సాయి గారి విషయాల్లో ఎలిమినేషన్ ప్రేక్షకుల ఓట్లకి తగినట్టుగా జరగలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరో పక్క ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు కలగడానికి కారణం అభిజిత్ సేవ్ అవుతూ రావడమే. టాస్కులో పెద్దగా పర్ ఫార్మ్ చేయకుండా అడ్డదిడ్డంగా ఆడుతూ ఉన్నాడన్న అభిప్రాయంతో పాటు ఇతరులని చిన్నచూపు చూస్తున్నాడన్నది కూడా ప్రేక్షకుల్లో బాగా స్థిరపడిపోయింది. ఈ నేపథ్యంలో అభిజిత్ కి బయట అంత ఫాలోయింగ్ లేదని, కేవలం కొన్ని ఏజెన్సీలు కావాల్నే అభిజిత్ కి ఓటు వేసేలా చేస్తున్నాయని అంటున్నారు.
బిగ్ బాస్ ఫాలో అయ్యేవారికి ఇలాంటి సందేహాలు రావడం సాధారణమే. మరి ఈ విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం గుర్తిస్తుందా లేదా చూడాలి. కాకపోతే ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ పై ప్రేక్షకులకి ఉండే నమ్మకం తగ్గిపోతుందని, దానివల్ల చూసే ప్రేక్షకులు తగ్గిపోయి టీఆర్పీ పై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి.