సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీలో చేరి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని కొన్ని రోజుల క్రితం దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్ అన్నారు. అయితే ఒక్క షరతు పెట్టారు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటేనే ఆయన పార్టీలో చేరుతానని తాజాగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికోసం రాజకీయాల్లోకి రాలేదని కొన్ని రోజుల క్రితం తలైవా చెప్పారు. దీనిపై లారెన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయన అభిమానులంతా ఆయన ను సీఎంగా చూడాలి అనుకుంటున్నారని.. అందుకే రజనీ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ… ఓ ప్రకటన విడుదల చేశారు. రజిని సీఎం కావాలని కేవలం నేనే కాదు ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే ఎన్నిసార్లైనా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తా అంటూ రాఘవ లారెన్స్ తెలిపారు.