ప్రధాని మోడీ ని కలిసిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు తమిళం ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ… మంచి నటుడిగా రజినీకాంత్ పేరు తెచ్చుకున్నారు. రజినీకాంత్ సినిమా విడుదలైతే… ఆ సందడే వేరు. అయితే ప్రస్తుతం.. సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

ఇందులో భాగంగానే ఈనెల 25వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు సూపర్ స్టార్ రజినీ కాంత్. అయితే ఈ రోజున తన సతీమణి లత తో కలిసి ఇ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు సూపర్ స్టార్ రజినీకాంత్. మర్యాదపూర్వకంగా వీరి సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం రజినీకాంత్ ఫ్యామిలీ.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిసింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం… సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.