RajiniKanth: ‘త‌లైవా’కు వ‌రించిన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’.. కానీ ఊహించ‌ని నిర్ణ‌యం..!

RajiniKanth: 67వ జాతీయ చలనచిత్ర అవార్డు ల ప్రదానోత్సవం ఢిల్లీలో చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు.
ఆయ‌న చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

దక్షిణాది సూపర్ స్టార్, త‌లైవా రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా సినీ పరిశ్ర‌మ‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం ద‌క్కింది. ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం నిజంగా చాలా సంతోష‌మ‌ని తెలిపారు. ఆ అవార్డును త‌న గురువు, మార్గదర్శి కె.బాలచందర్ కు, త‌న‌ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ కు, అలాగే.. తాను బస్ కండక్టర్ గా పనిచేసినప్పుడు డ్రైవర్ గా వ్యవహరించిన రాజ్ బహదూర్ కు అంకితం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

తాను బాలచందర్ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంట‌న‌నీ, అలాగే.. త‌న సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ తండ్రి తర్వాత తండ్రి లాంటివాడని, గొప్ప విలువలతో నన్ను తీర్చిదిద్దాడ‌నీ.. ఆధ్యాత్మిక బీజాలు వేసింది అత‌డే న‌ని చెప్పాడు . అలాగే.. త‌న‌ మిత్రుడు రాజ్ బహదూర్ గురించి చెప్పాలంటే… త‌న‌లో ఉన్న నటుడ్ని గుర్తించి.. ప్రోత్సహించింది అతడేన‌నీ.అందుకే ఈ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

త‌న‌తో ప‌నిచేసినా దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, సహనటులు, డిస్ట్రిబ్యూటర్లు, వివిధ రకాల మీడియాకు త‌న అభివృద్దికి దోహ‌దం చేసినా.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇదే వేదికపై రజనీకాంత్ అల్లుడు ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం విశేషం. అసురన్ చిత్రంలో నటనకు గాను ధనుష్ ను నేషనల్ అవార్డు వరించింది.

ఇక తెలుగులో ‘మహర్షి’ , ‘జెర్సీ’ చిత్రాల‌కు అవార్డులు లభించాయి.జాతీయ ఉత్త‌మ న‌టిగా కంగనా రనౌత్ (మణికర్ణిక) చిత్రానికి ఈ అవార్డు ల‌భించింది. సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ర‌జ‌నీకాంత్ అందుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది.

నేష‌న‌ల్ అవార్డ్స్ విజేత‌లు వీరే.. !

ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)

ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ (బహత్తర్‌ హూరైన్‌)

ఉత్తమ నటుడు: మనోజ్‌ బాజ్‌పాయీ (భోంస్లే), ధనుష్‌ (అసురన్‌)

ఉత్తమ నటి : కంగనా రనౌత్‌ (మణికర్ణిక)

ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ

ఉత్తమ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి (జెర్సీ)

ఉత్తమ వినోదాత్మక చిత్రం: మహర్షి

ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే

ఉత్తమ తమిళ చిత్రం: అసురన్‌

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)

ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ (మలయాళం)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి.ఇమ్మాన్‌ (విశ్వాసం)

ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య): ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)

ఉత్తమ గాయకుడు: బ్రి.ప్రాక్‌ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ…’)

ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం (మహర్షి)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ మేకప్‌: రంజిత్‌ (హెలెన్‌)