ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి రోజున ఏకంగా మూడు పథకాల నిధులను విడుదల చేయనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్ర సేవా పథకం నిధులను విడుదల చేయనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
ఇవాళ మధ్యాహ్నం రైతుల ఖాతాల్లో వర్చువల్ గా నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ మూడు పథకాల క్రింద రైతుల ఖాతాల్లో రూ.1,214 కోట్లు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. ఆగష్టులో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ క్రింద రూ. 977 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది ఏపీ సర్కార్. ఇక ఇవాళ్టి రోజున మూడు పథకాలతో కలిపి. రూ. 1214 కోట్లు జమ చేయనుంది.