పేదలకు తిప్పలే.. నేటి నుంచి ఏపీలో రేషన్ షాపుల బంద్

-

నెల నెల రేషన్ తీసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలకు ఇక్కట్లు తప్పకపోవచ్చు. లబ్ధిదారులకు రేషన్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఏర్పడింది. తాజాగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ లోని రేషేన్ డీలర్లు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రేషన్ దుకాణాల బంద్ కు డీలర్ల సంఘం పిలుపునిచ్చింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌకధరల దుకాణాల్లో రేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేేఏవై) కమీషన్ డబ్బులు ఇవ్వాలని డీలర్ల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన కందిపప్పు నగదు బకాయిలు చెల్లించాలని కోరతున్నారు. ఇదే విధంగా గోనె సంచులు ఇస్తే రూ. 20 ఇస్తామని సర్క్యూలర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సంచుల ఇచ్చినా చెల్లింపులు ఉండవని ఇప్పుడంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. అయితే రేషన్ డీలర్ల నిర్ణయంతో ఏపీలో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. నెలనెల రేషన్ తో నెట్టుకొచ్చే కుటుంబాలు తాజా బంద్ తో ఇక్కట్ల పాలవనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news