ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ప్రస్తుతం ఫామ్ చాలా మిక్స్ డ్ గా ఉందనే చెప్పాలి. అతను ఈ మధ్య నటించిన చిత్రాల్లో కాలా మినహాయించి మిగిలినవన్నీ హిట్ కి అటు ఇటుగా యావరేజ్ కు పైగా రివ్యూ తెచ్చుకున్నాయి. తమిళంలో ఎలా ఉన్నా రజనీ రికార్డులు కొట్టేస్తారు. అయితే అతను చేసే చిత్రాలను ఎంచుకోవడంలో మాత్రం రజిని ఈ మధ్య కొంచెం తడబడుతూ ఉన్నట్లు అనిపిస్తోంది.
ఇప్పటికే వరుసగా రెండు సినిమాలు చేసిన రజిని తర్వాత సినిమా మురుగదాస్ దర్శకత్వంలో అనగానే ఫ్యాన్స్ అంతా ఎగిరి గంతేస్తారు. అయితే స్పైడర్ మరియు సర్కార్ లాంటి సినిమాల తర్వాత మురుగదాస్ నమ్ముకోవడంతో రజనీ అభిమానుల కొంచెం ఆలోచనలో పడ్డారు.
దానికి తగ్గట్టు అతను చెప్పిన ఒక రొటీన్ స్టొరీ ని రజిని ఓకే చేయడమే ఈ దర్బార్ సినిమాకి పెద్ద మైనస్. సాధారణంగా మురుగదాస్ కథలలో చాలా వైవిధ్యం ఉంటుంది అయితే ఈ సినిమాలో అది మిస్ కాగా ఫామ్ లో లేని డైరెక్టర్ రొటీన్ స్టొరీ తీస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు బయట టాక్ ని బట్టి చెప్పొచ్చు. కాబట్టి అసలు మురుగుదాస్ ని నమ్మడమే రజనీ చేసిన పెద్ద తప్పు అని చెప్పాలి.