తాత్కాలిక మూడవ వన్ డే లో రాజ్ కోట్ మైదానంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయానికి తగిన విధంగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రాణించి ఇండియా ముందు కఠినతరమైన లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత ఓవర్ లలో ఆస్ట్రేలియా 352 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లలో డేవిడ్ వార్నర్ (56) ఈ సిరీస్ లో వరుసగా మూడవ అర్ద సెంచరీ సాధించి జట్టుకు మంచి పునాదిని వేశాడు.. ఇక మరో ఓపెనర్ గా వచ్చిన మిచెల్ మార్ష్ చక్కని ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఇతను మరో నాలుగు పరుగుల దూరంలో సెంచరీ ని కోల్పోయినా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు మరియు 3 సిక్సులు సహాయంతో 96 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్ (74) మరియు లాబుచెన్ (72) లో సైతం అర్ద సెంచరీ లు చేసి జట్టుకు గ్రాండ్ టోటల్ అందించడంలో తోడ్పడ్డారు.
ఇక ఇండియా బౌలర్లలో బుమ్రా మూడు మరియు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించారు. ఇప్పుడు ఇండియా ముందు ఉంచిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళుతుందా చూడాలి.