రాకింగ్ రాకేశ్ చిన్నప్పటి నుండి ఆర్టిస్ట్ కావాలని కలలు కన్నాడు. తన మనసులో మాట గ్రహించి దేవుడు జబర్దస్త్ ప్రోగ్రాం రూపం లో అవకాశం కల్పించాడు. ముందు టీమ్ లో సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి టీమ్ లీడర్ గా అయ్యాడు.తాను చేసిన స్కిట్స్ జనాలను కుడుపుబ్బ నవ్వించి మంచి రేటింగ్ తెచ్చిపెట్టాయి. రెమ్యూనేషన్ గురించి పట్టించుకోకుండా జనాలను నవ్వించడమే ధ్యేయంగా మొదటి నుండి ఇప్పటి వరకు అదే కమిట్ మెంట్ తో రాకేశ్ నటిస్తూ వున్నాడు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ సందర్బంగా ఆయన తన లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. అసలు నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు. కాని పెళ్లి చేసుకో అమ్మ నన్ను బతిమిలాడి ఒప్పించింది. సుజాత నా పరిచయం ప్రేమ వైపు దారి తీసింది. అలా మా ప్రేమ ముందుకు సాగింది. నేను అవకాశాల కోసం వరంగల్ వదిలి హైదరాబాద్ వచ్చాను. 11 ఏళ్లు ఎన్నో ఆఫీసులు తిరిగాను. మొదట్లో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేసుకునేవాడిని. మిమిక్రీ చేశాక పేమెంట్ ఇచ్చేదాకా వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం.
కమెడియన్ ధనరాజ్ నన్ను కామెడీ షోకి తీసుకెళ్లడం వల్లే నా లైఫ్ టర్న్ అయ్యింది ప్రస్తుతం . రేలంగి నరసింహారావు డైరెక్షన్‌లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేని దరిద్రం అనుభవించాను. చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. అవన్నీ తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అందుకే ఇప్పుడు చిన్న చిన్న వాటికి నేను బాధపడటం లేదు ‘ అని చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేశ్.