వాల్తేరు వీరయ్య విషయం లో చిరంజీవి చెప్పేది నిజం అవుతుందా..!!

-

ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుంది అంటే హంగామా మామూలుగా ఉండేది కాదు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతికి విడుదల చేసేలా థియేటర్ల అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేపు వీరయ్య టైటిల్ సాంగ్ రాబోతోంది. అయితే తాజాగా తాజాగా వాల్తేరు వీరయ్య టీం తాజాగా డైరెక్టర్ బాబీ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేయబోతోన్నట్టుగా చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఈ సినిమాను చిరంజీవి బాబీ ని అబినిందించి ఈ సినిమా  కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని అన్నాడట. దీనితో చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఆనందపడుతున్నారు. కాని విమర్శకులు మాత్రం గాడ్ ఫాదర్ సినిమా విషయం లో కూడా ఇలాగే పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అందుకోలేక పోయింది అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news