అప్పుడు నవ్వాను.. ఇప్పుడు నవ్వుతూనే ఉన్నా : రకుల్

దక్షిణాది చిత్రపరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మరోవైపు తన హాట్ హాట్ అందాలతో అందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అయితే ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రేక్షకులందరినీ ఆకర్షించేందుకు మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది అనే విషయం తెలిసిందే .

అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నది రకుల్ ప్రీత్ సింగ్. అయితే టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ మొదలు పెట్టి ఏడేళ్లు పూర్తి అవుతుంది ఈ క్రమంలోనే తన అనుభవాలను అభిమానులతో ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఏడేళ్ల ప్రయాణం అద్భుతంగా సాగింది.. నన్ను నమ్మి నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.. ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నవ్వుతూనే ఉన్నాను ఇప్పుడు నవ్వుతూనే ఉన్నాను… ఈ ప్రయాణం అద్భుతం అంటూ రకుల్ ప్రీత్ సింగ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.https://www.instagram.com/p/CIKdA6MBMzM/?utm_source=ig_web_copy_link