క్రెడిట్ కార్డు డెలివరీలో నిర్ల‌క్ష్యం.. క‌స్ట‌మర్‌కు రూ.25వేలు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌న్న ఫోరం..

-

స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యాక 7 నుంచి 10 రోజుల్లో కొన్నిసార్లు గ‌రిష్టంగా 15 రోజుల్లో కార్డు చేతికందుతుంది. కార్డు డెలివ‌రీకి క‌నీసం 3 రోజుల నుంచి గ‌రిష్టంగా 15 రోజుల వ‌ర‌కు బ్యాంకులు టైం తీసుకుంటాయి. కానీ ఆ వ్యక్తికి ఏకంగా నాలుగు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. దీంతో అత‌నికి చిరాకు వ‌చ్చింది. పైగా బ్యాంకు నుంచి వేధింపులు వ‌చ్చాయి. దీంతో విసుగు చెందిన అత‌ను వినియోగ‌దారుల ఫోరంలో బ్యాంకుపై కేసు పెట్టాడు. అందులో విజ‌యం సాధించాడు.

Negligence in credit card delivery .. Forum ordered bank to pay Rs 25000 compensation to the customer ..

థానెకు చెందిన డాక్ట‌ర్ నితేష్ క‌దం వెటర్న‌రీ డాక్ట‌ర్‌గా విదేశాల్లో ప‌నిచేస్తున్నాడు. స్థానికంగా అత‌నికి స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. 10 ఏళ్లుగా దాన్ని అత‌ను వినియోగిస్తున్నాడు. దీంతో 2013లో అత‌ను ఆ బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు పొందాడు. అయితే క్రెడిట్ కార్డు అప్రూవ్ అయ్యింది కానీ అది డెలివ‌రీ కాలేదు. అందుకు 4 నెల‌ల స‌మయం ప‌ట్టింది. కాగా ఆ కార్డును డెలివ‌రీ చేయ‌డంలో బ్యాంకు నిర్ల‌క్ష్యం వహించింది. ఎన్నిసార్లు అత‌ను ఫోన్ కాల్స్ చేసినా, ఈ-మెయిల్స్ పెట్టినా ప‌ట్టించుకోలేదు.

ఇక కార్డు డెలివ‌రీ కోసం విదేశాల్లో ఉన్న అత‌ను కొన్ని సార్లు ఇండియాకు కూడా రావ‌ల్సి వ‌చ్చింది. అయినా బ్యాంకు నుంచి స్పంద‌న లేదు. పైగా కార్డు అత‌నికి డెలివ‌రీ కాకున్నా దాన్ని అత‌ను వాడిన‌ట్లు రూ.5,026 అందులో ట్రాన్సాక్ష‌న్ జ‌రిగింది. ఆ మేర కార్డు బిల్లును కూడా బ్యాంక్ నెల నెలా పంపింది. ఈ విష‌యంపై కూడా అత‌ను బ్యాంకుకు ప‌లుమార్లు ఫిర్యాదు చేశాడు. అయినా బ్యాంక్ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు అత‌ను థానె క‌న్‌జ్యూమ‌ర్ డిస్‌ప్యూట్స్ రిడ్ర‌స్స‌ల్ క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించాడు. ఈ క్ర‌మంలో ఆ ఫోరం కేసు విచారించి డాక్ట‌ర్ నితేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అత‌నికి బ్యాంకు వారు రూ.25వేల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని తీర్పు చెప్పింది. ఇలా అత‌ను ఆ కేసులో విజ‌యం సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news