ముగిసిన రకుల్ విచారణ : 30 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈడీ !

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కాసేపటి క్రితమే ముగిసింది. ఉదయం నుంచి దాదాపు 7 గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేసారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ బ్యాంక్ లావాదేవీల పై ప్రశ్నించారు ఈడీ అధికారులు.

అంతేకాదు… 30 ప్రశ్నల కు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విచారణకు రావాలని రకుల్ కు చెప్పిన అధికారులు… కెల్విన్ తో సంబందాలు, F క్లబ్ లో పార్టీ పై ఆరా తీశారు. అలాగే…. రియా చక్ర వర్తి తో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పై విచారణ లో అడిగారు ఈడీ అధికారులు. మూడు బ్యాంక్ అకౌంట్లు లు రకుల్ నుండి క్లారిటీ తీసుకుంది ఈడీ. 13 తేదీన F క్లబ్ మేనేజర్, నవదీప్ విచారణ తరువాత రకూల్ వ్యవహారం పై క్లారిటీ కి రానున్నారు ఈడీ అధికారులు.