రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు రేసులో..!!

తెలుగు పరిశ్రమ దర్శక దిగ్గజం భారతీయ ప్రేక్షకుల కోసం ఆర్ ఆర్ ఆర్  సినిమా తీస్తే అది నెట్ ఫ్లిక్స్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వరస బెట్టి ఘనతలు సాధిస్తోంది.  రీసెంట్ గా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్డ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ సినిమాకు గాను సన్ సెట్ సర్కిల్ అవార్డు దక్కింది.అలాగే  ఈ సంత్సరమంతా ప్రపంచ స్తాయిలో విడుదల అయిన సినిమాలలో ఐ ఎం డి బి వారు ప్రజల్ని ఆకట్టుకున్న మొదటి  50 సినిమాలలో  ఆర్ఆర్ఆర్ కూడా ఎంపిక అయ్యింది.

ఇక రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ వారిచే ఉత్తమ దర్శకుడి గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డ్ వచ్చిన వారు ఆస్కార్ అవార్డు కు దగ్గరగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ’ ‘నాటు నాటు’ పాట కూడా ఇప్పుడు హలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. ఈ పాటకు ఎన్నో దేశాలలో ఎంతో మంది రకరకాలు గా డాన్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సాంగ్ ఆస్కార్ ను  ఇండియాకి తెచ్చేలాగే ఉంది. అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ ‘ఆస్కార్’ ఆశ నిజమయ్యే అవకాశం ఉందని చెప్తూ… ‘హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్’ ఒక ఆర్టికల్ వేసింది.. ‘సీనియర్ అవార్డ్ కాలమిస్ట్ స్కాట్ ఫీన్బర్గ్’ అంచనా ప్రకారం ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలిచే ఆస్కారం ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ వస్తుందని ‘స్కాట్ ఫీన్బర్గ్’ అంచనా వేశాడు.. ‘‘నాటు నాటు’ పాటతో మరో సారి రామ్ చరణ్ మరియు జూ ఎన్టీఆర్ ఇద్దరూ హలీవుడ్ లెవల్ లో హాట్ టాపిక్ గా మారారు. ఇక వీరికి ఆస్కార్ అవార్డు వస్తే కొత్త సంవత్సరం రోజున హంగామా కు హద్దే ఉండదు