మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు కియారా అద్వానీ లు జంటగా నటిస్తున్న తాజా చిత్రం “గేమ్ చేంజర్”. ఈ సినిమాకు తమిళ దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. మాములుగా శంకర్ నుండి సినిమా వస్తోంది అంటే ఇండియా ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో తెలిసిందే. ఈ సినిమాలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలను మేళవించి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి కియారా అద్వానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ గేమ్ చేంజర్ టీం రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి షూట్ చేస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాము అంటూ కియారా తెలిపింది. నేను రామ్ చరణ్ మరియు శంకర్ ల నుండి చాలా నేర్చుకోవాలి అంటూ వారిపై పొగడ్తలు కురిపించింది.
ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంతగానో రజింపచేస్తుంది అంది కియారా. కాగా ఈ సినిమా నుండి టైటిల్ మరియు నటీనటులు మినహా ఇంకేమీ అప్డేట్స్ రాకపోవడం చాలా నిరాశ అని చెప్పాలి.