అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటి..!!

-

ఇటీవల కాలంలో చాలా మంది నటీమణులు ఎక్కువగా ఏదో ఒక జబ్బుతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు కూడా క్యాన్సర్ బారిన పడుతూ రక రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక బుల్లితెర నటి ఐశ్వర్య సఖుజ కూడా ఇటీవల అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్వయంగా తెలపడం గమనార్హం. ఇక ఆమె మాటల్లోనే ఈ వ్యాధి గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.Aishwarya Sakhuja Wiki, Age, Height, Boyfriend, Husband, Family, Biography & More - WikiBio

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య మాట్లాడుతూ 2014లో నా లైఫ్ లో జరిగిన సంగతి ఇది. నేను ఆ సమయంలో ఒకసారి షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను. మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్ కోసం వెళ్తున్నాను. అప్పుడు నా భర్త రోహిత్ ఎందుకు నన్ను కొడుతున్నావ్ అని అడిగాడు. తను నాతో ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత రోజు ఉదయం బ్రష్ చేసుకున్నప్పుడు విపరీతమైన నొప్పి వచ్చింది. తర్వాత నా రూమ్మేట్ నా మొహం మారిపోయింది ఏంటి అని నాతో చెప్పింది. దాంతో నేను వెళ్లి డాక్టర్ ను కలిశాను. అప్పుడే నాకు రామ్ సే హంట్ అనే వ్యాధి ఉన్నట్లు బయటపడింది. కానీ అప్పటికే నేను కొన్ని ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం తో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకోలేదు. నా మొహం కవర్ చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొనే దాన్ని. దాంతో నాకు స్టెరాయిడ్స్ ఇచ్చీ వైద్యం చేశారు.Yeh Hai Chahatein's Aishwarya Sakhuja takes a break from the show as she undergoes minor surgery | PINKVILLA

ఇక నటిగా అందంగా కనిపించడం అనేది చాలా ముఖ్యం.. తిరిగి నార్మల్ అవుతానో లేదో అని చాలా భయపడ్డాను. కానీ నెలరోజుల్లోనే ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఐశ్వర్య సఖుజ ఉజ్జా చమాన్ సినిమాలో ఏకపాత్ర లో కనిపించింది .అలాగే సాస్ బీనా ససురాల్, ఆషికి, త్రిదేవియాన్, యే హై చహతే వంటి సీరియల్స్ లో కూడా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news