RRR : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆర్ఆర్ఆర్ నుంచి చ‌ర‌ణ్‌ పోస్ట‌ర్ రిలీజ్‌..

-

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో మంది ఎంతో ఆస‌క్తి గా చూస్తున్నారు. ఈ సినిమా ను ఎంతో ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అలాగే… యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరో గా న‌టిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీగా అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ పోస్ట‌ర్ లో రామ్ చ‌ర‌ణ్ చాలా ప‌వ‌ర్ ఫుల్ లుక్ లో క‌నిపించారు. అంతేకాదు.. రామ్ చ‌ర‌ణ్ సిక్స్ ప్యాక్ లుక్ లో క‌నిపించారు. ఇక అంత‌కు ముందు… ఎన్టీఆర్ లుక్ ను కూడా విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ ముఖం నిండా ర‌క్తంతో క‌నిపించాడు. అలాగే… రెండు చేతుల్లో తాళ్లు ప‌ట్టుకుని… గాండ్రించిన‌ట్లు క‌నిపించారు. కాగా.. డిసెంబ‌ర్ 9 వ తేదీన ఆర్‌ఆర్‌ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news