రామ్ చరణ్ వచ్చేసాడు, ఇక దబిడి దిబిడే..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఆచార్యతో ప్లాప్ మూట గట్టుకున్నాడు.  అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కువగా శంకర్ సినిమా పైన ఆశలు పెట్టుకున్నారు.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి ఇప్పుడు ఈ సినిమా పై భారీ హైప్ నెలకొని ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్  రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఈ మధ్యలో షూటింగ్ కు గ్యాప్ వచ్చింది.ఈ గ్యాప్ లో  శంకర్ భారతీయుడు 2 షూటింగ్ లో బిజీ అవగా, రామ్ చరణ్ తన భార్య ఉపాసన తో కలిసి RRR జపాన్ ప్రమోషన్స్ కి వెళ్లి, ఆ తర్వాత టాంజానియా దేశం ట్రిప్ కు  వెళ్లారు.

ప్రస్తుతం రామ్ చరణ్ , ఉపాసన ఇద్దరూ తమ పర్యటన పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్  విమానాశ్రయం లో అడుగు పెట్టారు.దీంతో ఆగిపోయిన శంకర్ సినిమా మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు నిర్మాత గా వున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు తో పాటు మిగిలిన ప్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news