Big News : ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌

-

మునుగుడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. చాలా ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. దీంతో ఆయా కేంద్రాల్లో లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. అయితే.. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 1,44,878 ఓట్లు పోల్‌ అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 ఓట్లు పోలింగ్‌ అయ్యాయి. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు మరో గంట మాత్రమే మిగిలింది. చివరి గంటలో భారీగా పోలింగ్ శాతం పెరగనుంది. ఇప్పటికే చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో నిల్చున్నారు.

 

MUNUGODE BYPOLL: మునుగోడు బైపోల్స్‌లో టీఆర్ఎస్సా? బీఆర్ఎస్సా? గులాబీ  పెద్దలు కీలక నిర్ణయం | TV9 Telugu

దీంతో.. 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు. చివరి నిమిషం వరకు ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న వారికి ఎన్నికల సిబ్బంది టోకెన్స్ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఉదయం నుండి ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఓపిక లేక ఓటర్లు టెంట్ల కింద కూర్చున్నారు. ఎప్పుడు ఓటు వేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు.. అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news