నన్ను నటుడిగా నిలబెట్టిన చిత్రాలు ఆ రెండు.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

-

సినిమా రంగంలో హీరో, హీరోయిన్లు ఎక్కువ కాలం మనగలగాలంటే సరైన పాత్రలు పోషించాలని సినీ పరిశీలకులు చెప్తుంటారు. అది నిజం కూడా. ప్రతిభ ఉంటే సరిపోదు దానిని ప్రదర్శించడానికి బలమైన పాత్ర ఉండాలి. దానిని సరైన రీతిలో వెండితెర మీద ఆవిష్కరించాలి. అలా వెండితెరపైన టాలెంట్ ప్రదర్శితమైతేనే నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అలా తమ సినీ కెరీర్‌లో నటుడిగా తమ స్థాయిని పెంచి నిలబెట్టిన చిత్రాల గురించి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

 

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో రాజమౌళి, రామ్ చరణ్, రామారావు జూనియర్ విస్తృతంగా పాల్గొన్నారు. ముగ్గురు కలిసి దేశవ్యాప్తంగా 6 నగరాలతో పాటు దుబాయ్ కూడా వెళ్లి సినిమాను ప్రమోట్ చేశారు. కాగా, ఇప్పుడు హీరోలిద్దరు ఒక చోట, రాజమౌళి ఒక్కరు సెపరేట్‌గా ఇంటర్వ్యూలు ఇస్తూ పిక్చర్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్, చెర్రీలు.. తమ సినీ కెరీర్, ఆర్ఆర్ఆర్ విశేషాల గురించి పంచుకున్నారు.

తమలో ఉన్న నటుడిని తమకు పరిచయం చేసి, తమ స్థాయిని పెంచిన సినిమాలేంటని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. ఈ క్వశ్చన్‌కు ఇరువురు హీరోలు ఆన్సర్ చేశారు. తనను నటుడిగా నిలబెట్టడంతో పాటు తనలో తనకు కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసిన చిత్రం ‘టెంపర్’ అని తారక్ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం తాను తనకున్న భయాలు వదిలేసి మరీ నటించానని చెప్పుకొచ్చారు. చెర్రీ మాట్లాడుతూ తనను నటుడిగా నిలబెట్టిన చిత్రాలు ‘మగధీర, రంగస్థలం’ అని వివరించాడు. ఈ రెండు చిత్రాల ద్వారా తనలో చాలా మార్పులు వచ్చాయన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news