కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ప్రేక్షకులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇంకా అభిమానులు ఆ షాక్ నుండి బయటకు రాలేక పోతున్నాను. ఇక పునీత్ అంత్యక్రియలకు ఇతర ఇండస్ట్రీలో తో పాటు టాలీవుడ్ నుండి కూడా పలువురు స్టార్ హీరోలు హాజరైన సంగతి తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ తో సహా పలువురు నటీనటులు హాజరయ్యారు.
ఇక ఇప్పటికే పలువురు పునీత్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తున్నారు. కాగా తాజాగా ఈ రోజు రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను బెంగళూరు వెళ్లి పరామర్శించారు. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ అన్న శివ రాజ్ కుమార్ కు రామ్ చరణ్ ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.