Sarkaru Vaari Paata: స‌ర్కార్ వారి పాట న్యూ అప్డేట్! రిలీజ్ మీద సాయంత్రం క్లారిటీ!

-

Sarkaru Vaari Paata: స్టార్ హీరో మహేశ్‌ బాబు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. వరుస విజయాలతో దూసుక‌పోతున్న మహేష్ బాబు చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. డైరెక్ట‌ర్ పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్‌ సరసన, కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. కమర్షియల్ హంగుల‌తోనే కాకుండా మెసెజ్ ఒరియంట్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోని విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ మళ్లీ షూటింగ్‌ వేగాన్ని పెంచేసింది. సంక్రాంతి బ‌రిలో నిలిచి గ‌ట్టిపోయినివ్వ‌బోతుంద‌ని భావించారు మ‌హేశ్ బాబు ఫ్యాన్స్. అందరికంటే ముందుగానే మహేష్ విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు

కానీ మిగతా హీరోలు ఎవరూ కూడా మహేష్ సినిమా ఉందని కూడా ఆలోచించలేదు. జ‌న‌వ‌రి 7న ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ జ‌న‌వ‌రి 7 న రిలీజ్ కానున్న‌ది. అలాగే.. జ‌న‌వ‌రి 12న భీమ్లా నాయక్, ఆ తర్వాత రాధేశ్యామ్ జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. దీంతో నిర్మాతలు, మహేష్ బాబు మాత్రం రిస్క్ చేయకూడదని,సినిమాను వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై ఈ రోజు సాయంత్రం దీనిపై క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news