ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితం ఆధారంగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వైఎస్ మరణం నుంచి మొదలై జగన్ పార్టీ పెట్టడం, సీఎం కావడం వంటి ఘటనలను ఇందులో చూపించారు.ఇక మార్చి 8న ‘శపథం’ రిలీజ్ కానుండగా.. ఈ రెండు సినిమాలకు కొనసాగింపుగా ‘శాసనం’ పేరుతో మరో సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. కాగా వ్యూహం, శపథంలో జగన్, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలను చూపించారని వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలను చూపెట్టారు.