చంద్రబాబు, భువనేశ్వరిల ట్వీట్స్ కు రామ్ గోపాల్ వర్మ కౌంటర్

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరీ మధ్య జరిగిన ట్వీట్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘వావ్ కాఫీ కంటే మీ ఇద్దరి ఇంగ్లిష్ ఇంకా బాగుంది. దయచేసి ఈ ట్వీట్స్ చేస్తున్న వ్యక్తిని మీరు తొలగించండి అని అన్నారు. ఈ ట్వీట్స్ చేసింది లోకేశ్ అనుకుంటున్నా. తెలుగు ప్రజలకు నాయకులుగా ఉన్నప్పుడు మీరు ఇంగ్లిష్ ట్వీట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. ఆ గిరిజన సోదరులే మీ ఇంగ్లిష్ను అర్థం చేసుకోవాలి’ అని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే….’నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా అరకులో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి అరకు కాఫీ రుచి త్రాగగా, అందుకు సంబంధించిన ఫొటోను చంద్రబాబు ట్విటర్లో షేర్ చేసి ‘భువనేశ్వరి.. మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేసే అరకు కాఫీ ఎలా ఉంది’ అని అడిగిన సంగతి తెలిసిందే. . ఇక చంద్రబాబు చేసిన ట్వీట్కు ఆయన సతీమణి భువనేశ్వరి రిప్లై ఇస్తూ ‘నిజంగా చాలా బాగుందండీ. మన వంటగదిలో ఈ కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ అరకు అందాలు, ఇక్కడి ప్రజల మమకారంతో దీని రుచి మరింత పెరిగింది అని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news