ఓ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనను కలవడంపై అధిష్ఠానం వద్ద చర్చ జరుగుతోందని వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ తెలిపారు. ‘మాగుంట శ్రీనివాసులు రెడ్డికు టికెట్ కోసం పట్టుబట్టాను.. కానీ సాధ్యం కాలేదు అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. నేను పార్టీ మారేది లేదని హైకమాండ్ కు ఇప్పటికే వివరించా అని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేయకూడదు’ అని చెప్పుకొచ్చారు.
కాగా, వైసీపీ కి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించామని అన్నారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని,తమకు అహం లేదని.. ఆత్మగౌరవమే ఉందని మాగుంట వ్యాఖ్యానించారు.