కత్తి మహేష్ అరెస్టుతో రామ్ గోపాల్ వర్మ కి చిక్కులు..!

-

శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై పలువురు వ్యక్తులతో పాటు, హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి హైకోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇప్పుడు కత్తి మహేష్ అరెస్టుతో రామ్ గోపాల్ వర్మకి చిక్కులు వచ్చినట్టు తెలుస్తుంది.

ఎందుకంటే.. కత్తి మహేష్ ప్రస్తుతం ప్రభు దర్శకత్వంలో ‘రామ్ గోపాల్ వర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రముఖ వివాదాస్పద దర్శకుడిని టార్గెట్ చేస్తూ తీస్తున్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. కరెక్టుగా కత్తి కి సంబంధించిన సీన్లు షూట్ చేస్తున్నప్పుడే ఆయన అరెస్టు కావడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇకపోతే ఈ సినిమాలో షకలక శంకర్ కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news