భారత మాజీ క్రికెటర్, యూపీ మంత్రి చేతన్ చౌహాన్ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స పొందుతున్నారు. గతనెలలో కరోనా బారినపడిన ఆయనని లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం అతని శరీరంలోని చాలా అవయవాలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలతో క్రికెటర్లు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపోతే 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. అలాగే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.