క్రాక్ బ్యూటీతో రామ్ గోపాల్ వర్మ రొమాన్స్ !!

టాలీవుడ్ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. అయితే… ఈ మధ్యలో కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఆర్జివి.

అప్పట్లో బిగ్ బాస్ బ్యూటీ అరియన తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ చేశారు. ఇక ఇటీవల అదే ఫార్మేట్ లో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇక తాజాగా క్రాక్ సినిమాలో ఐటం సాంగ్ చేసిన అప్సరా రాణి తో వర్మ కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. హైదరాబాద్ లోని బ్రాడ్‌వే బ్రూవరీ పబ్ లో అప్సరా రాణి తో వర్మ స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.