ఒమిక్రాన్ వేరియంట్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

-

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన… ఒమీక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకు పాకినట్లు… వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ చాలా డేంజర్ అని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే అన్ని దేశాలు అ లర్ట్ అయ్యాయి.

అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో… ఇప్పటికే ” the omi kron variant ” అనే సినిమా వచ్చిందని… రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 1963 సంవత్సరం లోనే… దీనిపై సినిమా వచ్చింది అంటూ ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ. అయితే… రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పై కూడా… తమ స్టైల్లో స్పందిస్తున్నారు. మన ఇండియా కూడా.. ఆ సినిమాలో చెప్పినట్లు స్మశానం కాబోతుంది అంటూ… నెటిజన్లు ట్వీట్లూ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news