BIG BREAKING : దేశంలోకి ఎంటరైన ఓమిక్రాన్ వేరియంట్… ఇప్పటి వరకు 2 ఓమిక్రాన్ కేసులు నమోదు.

-

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఓమిక్రాన్ కరోనా వైరస్ దేశంలోకి కూడా ఎంటరైంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించింది. ఇటీవల బెంగళూర్ కు వచ్చిన ఇద్దరిలో ఈ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర హెల్త్ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఇన్నాళ్లు విదేశాలకే పరిమితమైన ఓమిక్రాన్ భారత్ లో కూడా నమోదవ్వడం దేశ ప్రజల్ని కరవరపరుస్తోంది. 24 గంటల్లోనే ఈ రెండు కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి, 46 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. వీరిద్దరు కూడా సౌతాఫ్రికా నుంచి వచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ప్రస్తుతం దాదాపు 29 దేశాల్లో ఇప్పటివరకు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఓమిక్రాన్ జాబితాలో ఇండియా కూడా చేరింది. మరోసారి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ప్రజలకు సూచించింది. అత్యంత వేగం దాదాపు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఓమిక్రాన్ వేరియంట్ ఐదు రెట్లు వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news