రామ్ “స్కంద” మూవీ ట్రైలర్ అవుట్ నౌ … !

-

టాలీవుడ్ హీరోలలో మినిమం గ్యారంటీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను ఏర్పరుచుకున్న వారిలో రామ్ పోతినేని ఒకరు. రామ్ పోతినేని ఇంతకు ముందు నటించిన ది వారియర్ చిత్రం ఫెయిల్ అవ్వడంతో రామ్ అభిమానులు మరియు రామ్ చాలా నిరాశపడ్డారు. కథ మంచిదే అయినా టేకింగ్ లో భారీగా లోపాలు ఉండడం వలన సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని బోయపాటి శ్రీను తో “స్కంద” అనే మాస్ టైటిల్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న దృఢమైన నిశ్చయంతో బరిలోకి దిగారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది.. కాగా తాజాగా ఈ రోజు కాసేపటి క్రితమే ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కు నందమూరి బాలకృష్ణ మరియు ఇతర సినీ ప్రముఖులు విచ్చేసి రామ్ కు శుభాకాంక్షలు తెలియచేశారు.

ఇక ఇందులో రామ్ కు సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల నటిస్తోంది. కాగా ఇందులో ప్రిన్స్ మరియు సాయీ మంజ్రేకర్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news