బ్రేకింగ్ : దీపికా, ప్రియాంకలను విచారించనున్న పోలీసులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

-

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రాను ముంబై పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ఫాలోవర్స్‌ తో పాటు, నకిలీ ఫాలోవర్స్‌ కు సంబందించిన కేసులో వీరిద్దరిని ముంబై పోలీసులు విచారించనున్నారు. అంశంలో ఎనిమిది సెలబ్రిటీలతో పాటు వీరిని కూడా ముంబై పోలీసులు విచారించనున్నారు. ఈ కేసును ముంబై స్పెషల్ బ్రాంచ్‌తో పాటు మహారాష్ట్ర సైబర్ సెల్ కలిసి విచారించనున్నాయి. అయితే ఇప్పటికే ఈ కేసులో 54 సంస్థల ప్రమేయమున్నట్టు ముంబై పోలీసుల విచారణలో తేలింది.

సిట్ స్పెష‌ల్ బ్రాంచ్, సైబ‌ర్‌సెల్ సంయుక్తంగా ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నాయ‌ని ఇప్ప‌టికే ముంబై జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విన‌య్ కుమార్ చౌబే తెలిపారు. ప్రముఖ సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణేలు వరుసగా మొదటి రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 54.6 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు. దీపికా పదుకొనే 50 మిలియన్ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news