“రామారావు ఆన్ డ్యూటీ” టైటిల్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ కు ముహూర్తం ఖరారు చేసింది. కింగ్ ఆఫ్ ద క్రౌడ్ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ను ఎల్లుండి అంటే జులై 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రాలు బృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలింది చిత్ర బృందం. కాగా… ఈ సినిమా జూలై 29 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version