రామాయణం (బాలకాండ)-2: వాల్మీకి అనే పేరు ఎలా వచ్చింది?

-

రామాయణం రాసింది ప్రాచేతసుడు అనే పేరుగల రుక్షుడు లేదా భార్గవుడు ఆయన్నే వాల్మీకి అని అంటారని తెలుసుకున్నాం. వాల్మీకి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

కిరాతధర్మంతో ఉన్న రుక్షుణ్ని అనుగ్రహించి శ్రీమద్రామాయణ కర్తగా చేయవల్సిన కాలం ఆసన్నమవుతుంది. దీంతో సప్తమహర్షులు ఆ దారిలో వెళ్లారు. వారి వద్ద ఉన్న సొమ్మును అపహరించాలన్న ఉద్దేశంతో రుక్షుడు వారిని చెట్టుకు కట్టివేస్తాడు. అప్పుడు నారదుడు రుక్షుడుని ఇలా అడుగుతాడు నీ పాపంలో, భార్యపుత్రులకి ఉందా? లేదా తెలుసుకునిరా! అని అంటాడు.

ramayanam balakanda, how valmiki got that name?

అంతే వెంటనే ఈ కిరాతకుడు ఇంటికి వెళ్లి నేను చేసిన పాపంలో భాగాన్ని మీరు తీసుకుంటారా అని భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను అడుగుతాడు.. కానీ వారందరూ ఒక్కటే సమాధానం చెప్తారు. నీవు తెచ్చిన ధనాన్ని లేదా ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. నీ పాపాలతో మాకు సంబంధం లేదు. జన్మసంస్కారమూ, జీవితంలో రాబోయే కాలంలో మార్పు, భగవత్ సంకల్పంతో అడవిలోకి వచ్చి ఆ మహర్షుల కట్టు విప్పుతాడు. వారికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పును మన్నించమని ప్రాధేయపడుతాడు. అంతేకాకుండా జీవితంలో తరించడానికి ఏం చేయాలో తెలపమని ప్రార్థిస్తాడు. దీంతో నారదుడు మరా అని రామనామాన్ని తిరగలమరగల ఉపదేశిస్తాడు. దాన్నే 12 లక్షలసార్లు అక్కడే కూర్చుని రుక్షుడు జపించాడు.

దాంతో అక్కడ పుట్టలు పెరిగాయి. నారదుడు తిరిగి వచ్చాడు,. రుక్షుడు అదేనండీ కిరాతకుడు చుట్టూ పుట్టలు పెరిగడం చూచి వల్మీకం నుంచి వచ్చినవాడు కాబట్టి వాల్మీకిగా ప్రసిద్ధి చెందుతావని నారదుడు ఆశీర్వదిస్తాడు. అప్పటి నుంచి ఆ కిరాతకుడికి వాల్మీకి అనే పేరు వచ్చింది. మహా రుషిగా మారాడు. తపంబు ఆచరిస్తూ తదనంతర కాలంలో శ్రీమద్రామాయణాన్ని రాసి ధన్యుడుగా మారాడు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news