ఉద్యమ సమయంలో జనగామ జిల్లా బచ్చన్నపేటలో కరువు పరిస్థితులను కళ్లారా చూశానని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆరోజు జరిగిన మీటింగ్‌లో యువకులు కనపించలేదని తెలిపారు. ఏడేళ్ల కరువు కారణంగా యువకులంతా వలస వెళ్లారని స్థానికులు చెబితే తనకు ఏడుపు వచ్చిందన్నారు సీఎం కేసీఆర్. పాలమూరులో కరువు..నల్గగొండ ఫ్లోరైడ్ సమస్యలు కూడా తనకు తెలుసన్నారు.
కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని చెప్పారు సీఎం కేసీఆర్. మేం లేనిదే మీరు ఎక్కడని కేంద్రాన్ని ప్రశ్నించాలని తెలిపారాయన. అది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. అప్పటి వరకు మనల్ని ఎవరూ పట్టించుకోరని అన్నారు సీఎం కేసీఆర్.