చిక్కుల్లో ఎడ్డీ ప్రభుత్వం.. మంత్రి రాసలీలల టేప్ విడుదల !

Join Our Community
follow manalokam on social media

ఇప్పటికే కర్ణాటకలో ఉన్న ఎడ్యూరప్ప ప్రభుత్వం చాలాసార్లు చిక్కుల్లో పడింది. యడ్యూరప్పను తప్పించి వేరే వారికి సీఎం పదవి అప్పగిస్తారని ప్రచారం చాలాసార్లు జరిగింది. అయితే ఇప్పుడు ఒక మంత్రి చేసిన ఘనకార్యం ఎడ్యూరప్ప పదవికి నిజంగా ఇబ్బంది కలిగించే విషయంగా మారింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకకు చెందిన రమేష్ జార్కిహొళి మంత్రి మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నటుగా ఉన్న ఒక వీడియో కర్ణాటక మీడియా వర్గాల్లో హల్చల్ చేసింది. ఈ వీడియోను ఓ సోషల్ మీడియా కార్యకర్త రిలీజ్ చేశారు, అలాగే దినేష్ అనే ఆర్టీఐ కార్యకర్త కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కానీ పోలీసులు ఇది పరస్పర ఆమోదంతో జరుగుతున్న శృంగారం అని చెబుతూ ఇంకా కేసులు నమోదు చేయలేదు. నిజానికి ఈ మంత్రి గారు గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు కానీ గతంలో ఏర్పడిన జెడిఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో ప్రముఖ పాత్ర పోషించారు. దానికి బహుమతిగా బిజెపి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టింది. అది కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన నీటిపారుదల శాఖకు అప్పగించింది. అయితే మంత్రికి సంబంధించి ఇది హనీట్రాప్ అనే ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. తన రాసలీలల వీడియో పై మంత్రి స్పందిస్తూ ఆ సీడీలో ఉన్నది తాను కాదని, తన ఫొటోలను ఉపయోగించి ఎవరో ఈ సీడీని రూపొందించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...