ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు టార్గెట్ చేసారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత కొన్ని రోజులుగా ఈనాడులో వస్తున్న వార్తలు, ఛానల్ లో ప్రసారమవుతున్న కథనాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పోలవరం పనులు ఆగిపోవడం, రాష్ట్ర రాజధానిగా అమరావతిని తరలించాలని జగన్ నిర్ణయం తీసుకోవడం వంటివి ఈనాడు టార్గెట్ చేస్తూ వస్తుంది.
ఇక పెన్షన్లు రద్దు చేయడం, రేషన్ కార్డుల తొలగింపు వంటి వాటిని కూడా ఈనాడు తన కథనాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తుంది. రాజధాని తరలింపు విషయంలో ఈనాడు కొన్ని కథనాలు రాసింది. ఆ కథనాలను ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి మద్దతుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రాజకీయంగా కూడా ఈనాడు రాసిన కథనాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
ఇక తాజాగా విజయవాడ ఆటో నగర్ గురించి కథనం రాసింది ఈనాడు. పాత లారీలు రావడం లేదు, కొత్త లారీలు పోవడం లేదంటూ కార్మికుల కష్టాలను ప్రస్తావించింది. రాజధాని మీద ఈనాడు ఆధారాలతో సహా కొన్ని రాసింది. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ వచ్చింది ఈనాడు. ఇవన్ని కూడా జగన్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని అంటున్నారు.
ఇక రాష్ట్ర ఆర్ధిక వనరులు పడిపోయే విషయంలో కూడా ప్రభుత్వం కొన్ని కథనాలు రాసింది. కియా మోటార్స్ వ్యవహారంలో రాయిటర్స్ రాస్తున్న కథనాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తుంది. కియా ఇచ్చిన వివరణ కూడా ప్రస్తావించింది. ఇవన్ని కూడా చికాకుగా మారాయి ఏపీ ప్రభుత్వానికి అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెప్పిన తర్వాతే ఈ విధంగా ఈనాడు వ్యవహరిస్తుంది అంటున్నారు.