వాన్ని అలాగే పొడిచి.. పొడిచి చంపాలి : రమ్య కుటుంబ సభ్యులు

-

గుంటూరు జిల్లాలో దళిత యువతి రమ్య హత్య కేసు.. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటన పై రమ్య కుటుంబ సభ్యులు స్పందించారు. సీఎం జగన్ చేసిన సహాయానికి చాలా సంతోషమని పేర్కొన్న రమ్య తల్లి… నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేసింది. “ఇంత సహాయం చేశారు..నాకు ఈ ఒక్క సహాయం చేయండి..మీకు మీ పాదాలకు పాలాభిషేకం చేస్తాం” అంటూ మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

బిడ్డను పోగొట్టుకున్న భాధ తో వేడుకుంటున్నానని..తన బిడ్డ ను హత్య చేసిన వాడికి శిక్ష పడాలని డిమాండ్ చేసింది మృతురాలి తల్లి. మా బిడ్డను చంపిన వాడిని ఉరి తీయాలి.. లేదా అలాగే పొడిచి పొడిచి చంపాలని…రమ్య తల్లి తో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.. దిశా చట్టం అమలు చేస్తారో ఏ చట్టం అమలు చేస్తారో మాకు తెలియదని…మా అమ్మాయి కి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని రమ్య తండ్రి పేర్కొన్నారు. తమ బిడ్డ హత్య తరువాత సీఎం జగన్ స్పందించిన తీరు కి కృతజ్ఞతలు తెలిపారు రమ్య కుటుంబ సభ్యులు. తమ అమ్మాయి కి ఉద్యోగం పొలం ఇస్తామన్నారని..దానికి కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news